హిట్లర్ నా ‘గాడ్ ఫాదర్’.. రొమేనియా వృద్ధుడి సంచలన ప్రకటన!

  • రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఓ క్యాంపులో జన్మించా
  • హిట్లర్ స్వయంగా ఎత్తుకుని బాప్టిజం చేశారు
  • నాకు గాడ్ ఫాదర్‌గా ఉంటానని ప్రామిస్ చేశారు
  • పెన్షనర్ అడాల్ఫ్ ఎర్నెస్ట్ స్టాడ్లెర్ 
రొమేనియా పెన్షనర్ సంచలన ప్రకటన చేశాడు. ప్రపంచాన్ని గడగడలాడించిన అడాల్ఫ్ హిట్లర్ తన ‘గాడ్ ఫాదర్’ అని పేర్కొన్నాడు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఓ క్యాంపులో జన్మించిన తనకు హిట్లరే బాప్టిజం చేశారని నార్తరన్ రొమేనియాలోని సుసీవా కౌంటీకి చెందిన అడాల్ఫ్ ఎర్నెస్ట్ స్టాడ్లెర్ (77) పేర్కొన్నారు. అయితే తనకు ఇప్పటి వరకు జర్మన్ పౌరసత్వం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జర్మన్-ఆస్ట్రియా సరిహద్దు సమీపంలోని హోహెనషావంగ్వాలో జర్మన్లు ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యాంపులో పుట్టిన తొలి బిడ్డను తానేనని పేర్కొన్నారు. తన తల్లిదండ్రులు జర్మన్లు అని వివరించారు.

క్యాంపులో జన్మించిన మొదటి బేబీకి తాను గాడ్‌ఫాదర్‌గా ఉంటానని హిట్లర్ ప్రామిస్ చేశారని, ఆ విషయాన్ని తల్లి తనతో చెప్పిందని పేర్కొన్నారు. తన బర్త్ సర్టిఫికెట్‌పై స్వయంగా హిట్లర్ సంతకం చేసినట్టు చెప్పుకొచ్చారు. హిట్లర్ తనకు గాడ్ ఫాదర్ కాబ్టటే తన పేరులో అడాల్ఫ్ వచ్చినట్టు వివరించారు. హిట్లర్ తనను ఎత్తుకుని ముద్దాడినట్టు కూడా తల్లి చెప్పిందని తెలిపారు. ఆ సందర్భంగా హిట్లర్ తన తల్లికి కొంత మొత్తం ఇచ్చి, పిల్లాడి బాధ్యతను తాను చూసుకుంటానని హామీ ఇచ్చారని పేర్కొన్నారు.
Go Back to Shorts
godfather
Romania
pensioner

More Telugu News